ఢిల్లీ నుంచి పాట్నా వరకు.. దీపావళి సందర్భంగా ప్రత్యేక వందేభారత్ ఎక్స్ప్రెస్ను నడుపుతున్నారు. అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలుగా రికార్డు నమోదు అయ్యింది. ఇవాళ ఢిల్లీ నుంచి ఉదయం 8.25 ని.కు రైలు ప్రారంభమైంది. 994 కిలోమీటర్లు ఆ రైలు ప్రయాణం చేస్తుంది. రాత్రి 8 గం.కు వందేభారత్ ఎక్స్ప్రెస్ పాట్నా చేరుకుంటుంది.