AP: తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడింది. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలోనే తయారీ కేంద్రంలో పలువురు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.