AP: వైఎస్ ఆస్తుల వ్యవహారంలో జగన్, షర్మిల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన డిమాండ్ చేశారు. కుటుంబ సమస్యను రాజకీయ సమస్యగా మార్చారన్నారు. తల్లి, కూతురు, కొడుకు ఆస్తుల గొడవ అని, ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని చెప్పారు. ఆ ముగ్గురి అక్రమ సంపదన ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబ ఆస్తులను ప్రజలకు పంచాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి విజ్ఞప్తి చేశారు.