KDP: బద్వేలులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దస్తగిరమ్మ కుటుంబానికి YCP పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.