ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా బయట లభించే జంక్ ఫుడ్‌ను లాగించేస్తుంటారు. పానీపూరి, మోమోస్, షవర్మా, మంచూరియా వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షవర్మాకు వాడే మాంసాన్ని శీతలీకరించకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఫుడ్ పాయిజన్ అవుతుందట. అపరిశుభ్రంగా వాటిని తయారుచేయడం, కల్తీ ఆహారాన్ని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.