ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీపై హర్యానా స్టీలర్స్ పంజా విసిరింది. 41-34తో తిరుగులేని ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్ 7 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. 4 మ్యాచుల్లో దబంగ్ ఢిల్లీకి ఇది రెండో పరాజయం కాగా.. 3 మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్కు ఇది రెండో విజయం.