AP: మద్యం షాపుల్లో MRP కంటే ఎక్కువ అమ్మితే తొలిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కూడా తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బెల్టు షాపులను అనుమతించొద్దని, బెల్టు షాపులను ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.