AP: నెల్లూరులోని వైసీపీ నేత వైవీ రామిరెడ్డిపై రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన ఎస్ఎల్వీ క్రషర్లో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సీజ్ చేసిన క్వారీలో కంకర తరలింపు, మైనింగ్ చేయడంతో కేసు నమోదైనట్లు సమాచారం. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడంతో అధికారులు రూ.100 కోట్లు ఫైన్ వేశారు. ఫైన్ కట్టకపోవడంతోపాటు సీజ్ చేసిన క్రషర్లో మైనింగ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.