AP: సీఎం చంద్రబాబుతో అదానీ ఎక్స్‌పోర్ట్స్ ఎండీ రాజేష్ అదానీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై విస్తృత చర్చ కీలక రంగాలపై సీఎంకు అదానీ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓడరేవులు, మైనింగ్, రింగ్‌రోడ్డు, ఐటీ, ఏఐ, టూరిజంపై ప్రజెంటేషన్‌లో చర్చలు జరిపారు. అమరావతి పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని అదానీ ప్రతినిధులు తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌కు తమ మద్దతు తెలిపారు.