రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆరోగ్య సేవా కార్యక్రమానికి నీతా అంబానీ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గుండె సంబంధింత సమస్యతో బాధపడుతున్న 50వేల మంది చిన్నారులకు, గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 50వేల మంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్‌తో పాటు చికిత్స అందించనున్నారు. దీంతో పాటు 10వేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ అందివ్వనున్నారు.