AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ నిపుణులను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై ఉపాధ్యాయులకు మొదటి విడత శిక్షణను ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నారు. మొదట తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక ఇంగ్లిష్ మీడియంలోనూ అందించనున్నారు.