TG: హైదరాబాద్ బాగుండాలని తాము పనిచేసినట్లు మాజీమంత్రి KTR అన్నారు. నాచారంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించిన కేటీఆర్.. దేశంలోనే అతిపెద్ద STPని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాము ఇల్లు కడితే రేవంత్ రెడ్డి వచ్చి సున్నం వేశారంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో సుమారు రూ.4వేల కోట్లు ఖర్చు చేసి STP ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశామన్నారు.