NLR: రాపూరు పట్టణంలోని సీవీకె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గణితం అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్ నాయక్ తెలిపారు. MSC గణితంలో 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. BED కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.