ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(85) ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనేదానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 1989లో రుహుల్లా ఖొమేనీ మృతి తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్‌గా అయతొల్లా బాధ్యతలు స్వీకరించారు. కాగా, దీనిపై ఇరాన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.