VZM: పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఛార్జీలు పెంచి రూ.672 కోట్ల భారం మోపడం దారుణమని అన్నారు. సర్దుబాటు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.