కడప: వేంపల్లె రాజీవ్‌నగర్ కాలనీలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న షేక్ సానియా అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీకి వెళ్లమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై, ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. ఈ ఘటన స్థానికులను విషాదంలో ముంచేసింది.
Tags :