NLR: ఉదయగిరి పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ఆదివారం పంచాయతీ బస్టాండ్లో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి పలు సూచనలు చేశారు. దుకాణాల ఎదుట ఇబ్బందికరంగా ఆటోలు నిలిపినా, ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా చర్యలు తప్పవన్నారు. ఇటీవల ఉదయగిరిలో మరో కొత్త ఆటో యూనియన్ ఏర్పడినప్పుడు నుంచి ఈ సమస్యలు తలెత్తుతున్నాయని SI తెలిపారు.