VZM: అనంతగిరి మండలం కొత్తూరుకు చెందిన బంతిలా వనజ (32) గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. 108లో గర్భిణీని ఎస్.కోట పీహెచ్సీకి తరలిస్తున్న క్రమంలో కాశీ పట్టణం సమీపంలో గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో ఈఎన్టి మౌనిక పైలెట్ మూర్తి సహకారంతో 108లో సుఖ ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డలను ఎస్.కోట పీహెచ్సీకి తరలించారు.