ఢిల్లీలో కాలేజీ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేసిన రోజులను తాజాగా సీజేఐ చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. తను మూడు లేదా నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు తన తల్లి తరచుగా ముంబైలోని AIR స్టూడియోస్‌కు తీసుకువెళ్లేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వెళ్లిన తర్వాత, ఆకాశవాణి కోసం ఆడిషన్లో పాల్గొని.. హిందీ, ఇంగ్లీషులో కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించానని తెలిపారు.