టెస్లా CEO ఎలాన్ మస్క్ కొంతకాలం వర్క్ పర్మిట్ లేకుండానే అమెరికాలో పనిచేసినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన మస్క్.. 1995లో జిప్ 2 అనే సాఫ్ట్‌వేర్‌లో కొన్నాళ్లు అక్రమంగా పనిచేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. కాగా, 1997లో మస్క్ వర్క్ పర్మిట్ పొందినట్లు ఆయన మాజీ సహచరులు వెల్లడించినట్లు పేర్కొంది. మరోవైపు తాను చట్టబద్ధంగానే ఉన్నానని 2020లో మస్క్ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్లు సమాచారం.