PPM: పోలీస్ అమరవీరులు సంస్కరణ వారోత్సవాలు – 2024లో భాగంగా పార్వతీపురం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆధ్వర్యంలో రేపు 9 గంటల నుండి స్దానిక చాకలి బెలగాం సాయిబాబా కోవెల దగ్గర మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఆపదలో ఉన్న మరో నలుగురు ప్రాణాలు కాపాడాలని ఎస్పీ పిలుపునిచ్చారు.