దేశంలోని న్యాయవాదులకు మాజీ సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కీలక సూచనలు చేశారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. న్యాయరంగం అత్యంత క్లిష్టమైనదని, యువ లాయర్లకు తొలి రోజుల్లో పడే పునాదే వారి భవితను చివరి వరకు నడిపిస్తుందని పేర్కొన్నారు.