ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ IPO త్వరలో ప్రారంభం కానుంది. నవంబర్ 6న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 8న ముగియనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ IPO ద్వారా 18,22,86,265 షేర్లను ఆఫర్ సేల్ కింద కంపెనీ విక్రయించనుంది. దాదాపు రూ.10వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కాగా, IPO ధరల శ్రేణి వివరాలు వెల్లడించాల్సి ఉంది.