తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థ వరుసగా మూడో రోజు మెయిల్స్ పంపించింది. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెదిరింపులు వచ్చిన హోటళ్లల్లో తనికీ చేస్తున్నారు. కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.