TG: హైదరాబాద్ రాయదుర్గంలో భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గ్రీక్ బిల్డర్స్‌తో కలిసి అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ ప్రభుత్వ భూమిని కాజేశారు. అంతేకాక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ఈ దందాను గుర్తించిన రెవెన్యూ అధికారులు.. సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. గురుసాయిరాజ్ సహా ఆరుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు.