BPT: పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చందోలు గ్రామంలో ఆదివారం శ్రీభగలాముఖి అమ్మవారు అభయ ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. మండలం నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు మహిళలు మొక్కుబడులు చెల్లించుకున్నారు.