AP: విశాఖ-విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసు ఉదయం 9.35కి విశాఖ నుంచి బయలుదేరి 10.35కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు అక్కడ బయలుదేరి 9 గంటలకు విశాఖకు వెళ్తుంది. ఇండిగో సర్వీసు రాత్రి 7.15కు విజయవాడలో మొదలై 8.20కి విశాఖ వెళ్తుంది. తిరిగి రాత్రి 8.45కు విశాఖలో బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుతుంది.