VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం స్థానిక మత్స్యకార కాలనీతో పాటు షిప్పింగ్ పోర్ట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.