ATP: శింగనమల క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు హరేరామ హరే కృష్ణ భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు టైరు పేలి లారీని ఢీకొందా? అతివేగం కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారంతా 30 ఏళ్లలోపు వారే.