TG: జనగామ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని SR షాపింగ్ మాల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పక్కనున్న మరో వస్త్ర దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ.10కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాన్యం తెలిపింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.