తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి నితీష్ కుమార్ను ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆల్రౌండర్ కోటాలో అతడికి జట్టులో చోటు కల్పించి ఉంటారు. నితీష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా వేగంగా బౌలింగ్ కూడా చేస్తాడు. ఈ కారణంతోనే అతడు ఆస్ట్రేలియా సిరీస్లో చోటు దక్కించుకున్నాడు’ అని తెలిపారు.