TG: తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) కానిస్టేబుళ్ల ఆందోళనల వేళ పోలీసు శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. సమస్యలపై ‘దర్బార్’ కార్యక్రమంలో తెలియజేయాల్సిన వారు ఆందోళన చేపట్టడం తీవ్ర పరిణామంగా పరిగణించాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించారు. సెలవుల ప్రకటనపై ప్రభుత్వం వెనక్కి తగ్గినా కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. క్రమశిక్షణ కలిగిన పోలీసు ఉద్యోగంలో ఉండి ధర్నాలు చేశారని ఆర్టికల్ 311 ప్రకారం.. 39 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.