KDP: టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకుని ప్రయోజనాలను పొందాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రజలకు సూచించారు. శుక్రవారం స్థానిక నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, అమరావతిలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు.