కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర విమర్శలు చేశారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో రోహిత్ ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ సరిగా లేదన్నారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ ఉండాలని అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చూస్తుంటే కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. వెంట వెంటనే వికెట్లు తీసేలా వ్యూహం రచిస్తే విజయావకాశాలు ఉంటాయని వెల్లడించారు.