ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ సదుపాయమును 24 గంటలు అందించాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆజేంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ.. డెలివరీకి వచ్చే గర్భిణీ స్త్రీలకు అనంతపురం రిఫర్ చేయకుండా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలన్నారు.