AP: ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల సీఈ, ఎస్ఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అత్యవసర పనుల కోసం ప్రభుత్వం రూ.284 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టుల్లో చేపట్టాల్సిన 2,323 పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు.