బాలీవుడ్ PR ఏజెన్సీలపై నటి సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నన్ను ప్రమోట్ చేసుకోవడానికి, తరచూ వార్తల్లో ఉండటం కోసం PR ఏజెన్సీ కావాలా..? అని అతను అడిగారు. అలా చేయడం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదనిపించింది. తరచూ నా గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకులు బోర్‌గా ఫీల్ అవుతారు. అందుకే నాకు అలాంటిది ఏమీ అవసరం లేదని చెప్పాను’ అని పేర్కొంది.