పూణె వేదికగా NZతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 60 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో 23 ఏళ్ల వయస్సులోపు ఓ క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో 1000+ పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, ప్రపంచ వ్యాప్తంగా ఐదో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది 10 టెస్టులు ఆడిన జైస్వాల్ రెండు సెంచరీలు బాది 1007 పరుగులు చేశాడు.