ఒకానొక సమయంలో తాను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ ఓ పాడ్కాస్ట్లో తెలిపాడు. ‘గతంలో నేను 2 సినిమాలను నిర్మించాను. వాటి వల్ల డబ్బు మొత్తం పోయింది. నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయింది. దివాలా తీసే స్థాయికి దిగజారిపోయాను. ఆ సమయంలో నా భార్య వల్లే తిరిగి పుంజుకున్నాను’ అని తెలిపాడు. కాగా, ఆయన ‘ఫిరంగి’, ‘సన్ మన్జిత్ సింగ్’ మూవీలను నిర్మించాడు.