ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రాజమౌళి ఇప్పటివరకు టచ్ చేయని జానర్లో ఈ మూవీ రాబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే అలాంటి మూవీ ఇంతవరకు రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.