VSP: విశాఖ పోర్టు హాస్పిటల్ టెండరుకు ఎవరొచ్చినా అడ్డుకుంటామని సీఐటీయూ గౌరవ అధ్యక్షులు పద్మనాభరాజు, ఆల్ ఇండియా ఫెడరేషన్ కార్యదర్శి జగన్ హెచ్చరించారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హాస్పిటల్ వద్ద చేస్తున్న నిరసన దీక్ష 25వ రోజు శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.