కృష్ణ: ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న జగన్మాత దుర్గమ్మను పురపాలక శాఖ మంత్రి నారాయణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థాన అధికారులు దుర్గమ్మ చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను ఈ సందర్భంగా నారాయణకు అందజేశారు.