CTR: పుంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ ప్రతినిధి మునస్వామి మొదలియార్ తెలిపారు. చెన్నైకు చెందిన శంకర్ నేత్రాలయం వారిచే ఉచిత కంటి వైద్యశిబిరం విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యసేవలు పొందవచ్చు.