ATP: తాడిపత్రిలో మట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణ సీఐ సాయి ప్రసాద్‌కు నందలపాడులో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో చాంద్ బాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి దాదాపు రూ.3 లక్షలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.