NLG: వానకాలం ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా పౌరసరఫరాల అధికారులు, మార్కెటింగ్ ,డీఆర్డీఏ, సహకార, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం సేకరణ సమస్యలపై సమీక్షించారు. అన్నికొనుగోలు కేంద్రాలలో గన్నిబ్యాగులను తగినంతగా ఉంచాలని, అలాగే ఇతర సౌకర్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.