NLR: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఇవాళ కావలి DSP శ్రీధర్ సమక్షంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు పలువురు స్థానిక యువత పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో హాజరైన వారిని శ్రీధర్ అభినందించారు.