AP: వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శల జల్లు కురిపించారు. సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను జగన్ పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయినే హత్య చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కోసం షర్మిల బాగా కష్టపడిందని.. ఇకపై షర్మిల, విజయమ్మలకు తాము రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఇప్పుడు జగన్ గురించి వాస్తవాలు తెలుసుకుంటారన్నారు.