AP: వైసీపీ అధినేత జగన్పై మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిని కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం చూస్తే.. జగన్ చరిత్రహీనుడిగా నిలవబోతున్నట్లు తెలుస్తోందని అన్నారు. గతంలో, ప్రస్తుతం ఉన్న ఆస్తులు.. వాటి విలువ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దీనిపై తక్షణమే ప్రత్యేక చర్చలు జరిపి.. చర్యలు తీసుకోవాలని కోరారు.