రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీపై మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రంగస్థలం’ మూవీ సరైన టైంలో రిలీజ్ కాలేదని అన్నారు. ఆ మూవీకి రావాల్సినంత గుర్తింపు రాలేదని, ఇప్పుడు వచ్చి ఉంటే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించేదని తెలిపారు. ఈ మూవీలో చరణ్ అద్భుతంగా నటించారని, ఇందులో ఊహించని ట్విస్టులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.