TG: రాష్ట్ర ప్రభుత్వంపై MIM అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే కుదరదని అన్నారు. ‘మేం ఎప్పుడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదు. అన్ని పార్టీలు మూసీపై రాజకీయాలు చేస్తున్నాయి. వ్యాపారాలు ఇక్కడ ఉంటే ఎక్కడికో ఎలా వెళ్లిపోతారు. బాధితులు ఎవరూ భయపడొద్దు.. మేం అండగా ఉంటాం. పేదల గూడు కూలుస్తామంటే సహించం’ అని తెలిపారు.